* అర్ధరాత్రి అక్రమ ఇసుక తరలింపు
* భయ బ్రాంతులకు గురవుతున్న స్థానికులు
* అడిగితే బెదిరింపులు . రాజన్న సిరిసిల్ల జిల్లా 8 డిసెంబర్ 2023 ప్రజా బలం ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మానేరు వాగు నుండి గత కొద్ది రోజులుగా ట్రాక్టర్ సహాయంతో యథేచ్ఛగా ఇసుకను ఇతర ప్రాంతాలకు. రాత్రి పది గంటల నుండి తెల్లవారుజామున అయిదు గంటల వరకు అక్రమ రవాణా చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం, అక్రమార్కులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మానేరు వాగు గుండ జిల్లా ఆర్ఎంపి భవనం ముందు. వాగు నుండి పైకి రావడానికి సులువుగా ఉండడంతో ,రాత్రి అయితే చాలు తెల్లవారు వరకు దర్జాగా అక్రమ ఇసుకను తరలిస్తున్నారు స్థానికులు పలుమార్లు రాత్రిపూట ఏమిటి అని ప్రశ్నిస్తే మీకు దిక్కున చోట చెప్పుకోమని స్థానికులను బెదిరిస్తున్నారు. రాత్రి పూట పెద్ద పెద్ద హారంలతో ఇష్టం వచ్చినట్టు వీధుల గుండా ట్రాక్టర్లు తిరుగుతున్నాయి . పొద్దంతా పనిచేసే అలిసిపోయి నిద్రపోదాం అనుకుంటే ట్రాక్టర్ సౌండ్ లతో నిద్ర లేకుండా పోతుందని స్థానికులు చెప్తున్నారు. రెవెన్యూ ,మైనింగ్ అధికారుల కళ్ళముందే ఇసుక తరలిపోతున్న ,ఎందుకు పట్టించుకోవడం లేదన్న వాదనలు సర్వత్ర వినిపిస్తున్నాయి .అధికారుల అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నామని కొందరు అక్రమార్కులు బహిరంగంగా చర్చించడం విశేషం .ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాలను జరగకుండా భూగర్భ జలాలు అడుగంటకుండా చూడవలసిన బాధ్యత జిల్లా ఉన్నత అధికారులపైనే ఉంది.