మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-
మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి అనివార్య కారణాల వల్ల అసంపూర్తిగా వదిలేశారు.సీసీ రోడ్డు అటు ఇటు వేసి మద్యలో
వేయక పోవడం ప్రయాణికుల అవస్థలు పడుతున్నారు.
వారి వారి గమ్యాలకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్తున్నారు. లీడర్ల లోపమా? నాయకుల లోపమా? అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీని కారణంగా అట్టి రోడ్డు వెంబడి ప్రయాణించే వాహనదారులు కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అధికారులకు ఈ సమస్య గురించి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.వెంటనే అసంపూర్తిగా మిగిలిన సీసీ రోడ్డు నిర్మాణాన్ని అధికారులు స్వయంగా పర్యవేక్షించి పనులు పూర్తి చేసి సమస్య పరిష్కరించాలని కాలనీవాసులు మీడియా ద్వారా కోరుతున్నారు.