కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందచేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

 

 

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా డిసెంబర్12:హన్మకొండలోని అంబేడ్కర్ భవన్లో మంగళవారం కాజీపేట 47,48,61,62,63 డివిజన్ మరియు హన్మకొండ 31,49వ డివిజన్ కు చెందిన లబ్దిదారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను అందచేశారు.ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజాకీయాలకు అతీతంగా అర్హులైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.ఎవరు కూడా దళారుల చేతిలో మోసపోవద్దని అన్నారు.ఈ నెల 15వ తేదీ దాటితే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు నిధులు వెనక్కి వెలుతాయి కాబట్టే ఇంతమంది కుటుంబాలను ఇబ్బంది పెట్టకూడనే ఉద్దేశంతోనే ఎమ్మార్వో,కార్పొరేటర్లు అందరూ కలిసి అత్యవసరంగా సమావేశపరిచి లబ్దిదారులకు చెక్కులు అందచేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు,జక్కుల రవీందర్ యాదవ్,పోతుల శ్రీమాన్,సయ్యద్ విజయశ్రీ రజాలి,మాజీ కార్పోరేటర్ మహమ్మద్ అబూబాకర్,సయ్యద్ రజాలి,జిల్లా మైనారిటీ సెల్ ఛైర్మన్ మీర్జా అజీజుల్లా బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking