పోలీస్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌

ఖమ్మం ప్రతినిధి జనవరి 25 (ప్రజాబలం) ఖమ్మం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్‌ శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రగతిపై శకటాలు, స్టాల్స్‌ను ఏర్పాటు చేయాలని, విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు, అధికారులు, ఉద్యోగులకు ఉత్తమ సేవాపురస్కారాల విషయంలో ఉత్తమ సేవలు, పారామిటర్స్‌లో సాధించిన ప్రగతిని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టరు డి.మధుసూదన్‌ నాయక్‌, డిఆర్డీఓ విద్యచందన, జిల్లా విద్యాశాఖధికారి సోమశేఖర్ శర్మ,ఆర్.టి.ఓ. మహమ్మాద్ గౌస్, డి.డి. సోషల్ వెల్ఫేర్ అధికారి సత్యనారాయణ, బి.సి.వెల్ఫేర్ అధికారిణి జ్యోతి, మునిసిపల్ అసిస్టెంట్ కమీషనర్ సత్యనారాయణ,రెవిన్యూ డివిజన్ అధికారి గణేష్, ఫైర్ ఆఫీసర్ జయప్రకాష్, కలెక్టరేట్ ఎ.ఓ.అరుణ సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking