ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీ గా అమలు: జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య.

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి అక్టోబర్: 7

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి,
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ ఆర్ ఓలు షేక్ రిజవ్వాన్ బాషా, అశ్విని తానాజీ, కృష్ణవేణి, డిసిపి రవీందర్,
లతో కలసి ఎన్నికల నిర్వహణపై ఏ ఈ ఆర్ ఓలు, ఎక్సైజ్ అధికారుల తో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలలో ర్యాంప్, విద్యుత్తు, టాయిలెట్లు, మంచినీరు, ఫర్నిచర్, తదితర వసతులు పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది కమిషన్ ఆధీనంలో పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని కాబట్టి ఎలక్షన్ ప్రశాంతంగా ముగిసేందుకు సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది సమన్వయంతో సమస్యలు తలెత్తకుండా సజావుగా విధులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల అధికారులు ఎన్నికల మార్గదర్శకాలను సంపూర్ణం గా అధ్యయనం చేయాలి అని అన్నారు. ఎన్నికల రిపోర్టులు సకాలంలో సమర్పించేలా పనితీరు పెంపొందించుకోవాలని సూచించారు.

ఎన్నికల నిర్వహణ నియమావళి ప్రకారం నియమించిన
ఎఫ్, ఎస్ ఎస్ టి, వి ఎస్ టి, వివిటి, ఎం సి సి, టీమ్ లు అంకితభావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.

ఎనుమాముల మార్కెట్ లోని
స్ట్రాంగ్ రూం ఏర్పాట్లను సంబంధిత అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేధించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్డీవో వాసు చెంద్ర, నర్సంపేట ఆర్డీవో కృష్ణవేణి, ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి,వి ఎస్ టి, వి వి టి, ఎమ్ సి సి బృందాలు
తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking