నేరాలపై విద్యార్థులకు అవగాహన. చేగుంట ఎస్.ఐ. హరీష్ ఏ.ఎస్.ఐ. బద్దం రవీందర్.

 

మెదక్ చేగుంట 27 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చేగుంట విద్యార్థులకు చేగుంట ఎస్సై హరీష్ గౌడ్, ఎఏస్ ఐ రవీందర్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో నమోదు చేయబడు కేసుల గురించి ఏ వివాదానికి ఏఏ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేస్తారో విద్యార్థులకు వివరించడం జరిగింది. అదేవిధంగా తొలి ప్రాథమిక నివేదికలో ఏ అంశాలు నమోదు చేయాలో, అత్యవసర సమయంలో ఏ విధంగా స్పందించాలి మరియు పోలీసులను ఈ విధంగా సంప్రదించాలని, అన్యాయం జరిగిన ప్రజలు ఎటువంటి భయాందోళనలకు లోను కాకుండా పోలీస్ స్టేషన్ కు రావాలని వారు అన్నారు. మరియు పోలీస్ స్టేషన్ లో సిబ్బంది చేయు పనులను, స్టేషన్ లో నమోదు చేయు రికార్డులను చూపిస్తూ వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ లు రవీందర్,రాంబాబు, కానిస్టేబుల్ భాస్కర్, రేణుక, ఉపాధ్యాయులు చల్లా లక్ష్మణ్, రఘుపతి, చక్రధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking