ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారు…

 

కేటీఆర్ కు కల్వకుంట్ల వ్యాధి సోకింది

ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం

మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాఫీజుద్ధిన్

మెదక్: అసెంబ్లీ ఎన్నికల్లో భారాస కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పిన..ఆపార్టీ నేతలు ఇంకా అధికార భ్రమలో ఉన్నారని… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులే అయిన విషయాన్ని మరిచి తమ ప్రభుత్వం పై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేయడం తగదని కాంగ్రెస్ పార్టీ మెదక్ బ్లాక్ అధ్యక్షులు, పార్టీ నాయకులు అశోక్ రెడ్డి, మ్యాకల రవి అన్నారు. శనివారం వారు మెదక్ లో విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారాస గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒకటి హామీలను అమలు చేయలేదని, దళితుడిని సీఎం చేస్తామన్న హామీని విస్మరించారని దుయ్యబట్టారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, నాణ్యత లోపాలు బయట పడుతున్న… వాటి పై భారాస నేతలు నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు మాత్రమే అయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని… రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన భారాస నాయకులు… ఆరు గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్ కు కల్వకుంట్ల వైరస్ సోకినట్టు ఉందని, ఈ వ్యాధి సోకిన వారు పిచ్చి పిచ్చి గా మాట్లాడడం… బూతులు తిట్టడం… పచ్చి అబద్ధాలు మాట్లాడడం… వాపును చూసి బలుపు అనుకోవడం, కోడి గుడ్డు మీద ఈకలు పీకడం… భ్రమలో బ్రతకడం ఈ వ్యాధి లక్షణాలు అన్నారు. ఈ వ్యాధి సోకిన వారి నుంచి రాష్ట్ర ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking