ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : విద్యార్థులు నూతన ఆవిష్కరణ లతో ముందుకు రావాలని, వేసవి సెలవుల్లో జిల్లా సైన్స్ కేంద్రంలో విజ్ఞాన శాస్త్రాలపై ఏర్పాటు చేసిన ఉచిత సైన్స్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో వేసవి శిక్షణ శిబిరాల సంబంధించి గోడ పత్రాలు,కరపత్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య,ముఖ్య ప్రణాళిక అధికారి గుగ్గిళ్ళ సత్యం, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లా సైన్స్ కేంద్రం,జిజ్ఞాస సంచార ప్రయోగశాల ద్వారా జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా విజ్ఞానాన్ని పంచుతూ, శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా విద్యార్థులకు చేరువగా చేయడం జరుగుతుందని, వేసవి సెలవుల్లో విద్యార్థులు విజ్ఞాన తృష్టితో బావి ఆవిష్కరణగా తీర్చిదిందుకు గత 4 సంవత్సరాల గా సైన్స్ కేంద్రం ద్వారా వేసవిలో సైన్స్ శిక్షణ శిబిరాన్ని కొనసాగించడం జరుగుతుందని, ఈ క్రమంలో ఈనెల 26వ తేదీ నుండి శిక్షణ శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు గూగుల్ ఫారం ను ఈనెల 22వ తేదీ లోగా పూర్తిచేసి, శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని, సమాజంలో అనేక సమస్యలకు పరిష్కారం చేసే నూతన ఆవిష్కరణలను రూపొందించాలని అన్నారు. ఈ శిక్షణ శిబిరంలో 100 మంది విద్యార్థులకు అవకాశం కల్పించడం జరుగుతుందని,జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల ఆవరణలో గల జిల్లా సైన్స్ కేంద్రంలో ఈ కార్యక్రమం పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.