జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 19 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలోని కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ముఖ్య నిర్వహణ అధికారి గణపతి లో కలిసి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు,మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎం.పీ.ఓ తో ఉపాధి హామీ పనులను నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని, వేసవిలో ఉష్ణోగ్రత దృష్ట్యా ప్రతి ప్రదేశాల్లో త్రాగునీరు, నీడ సౌకర్యంతో పాటు అవసరమైన మందులు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలని వడదెబ్బకు గురైన బాధితులకు ప్రథమ చికిత్స అందించి సమీప లోని ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలని తెలిపారు. ప్రతి ఉపాధి కూలీలకు 2 రూపాయల 50 పైసలు చొప్పున చాగంటి కొరకు కేటాయించడం జరిగిందని, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పని ప్రదేశాలను తరచుగా సందర్శించాలని, అవసరమైన ఏర్పాట్లు ను చేయాలని,జాబ్ కార్డు వివరములను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని తెలిపారు. పనులకు హాజరయ్యే ఉపాధి కూలీల హాజరు పట్టిక సాంకేతిక సహాయకులు అందించాలని, నెల కు ఒకసారి క్లోజ్ గాని దివాస్ కార్యక్రమం నిర్వహించాలని, ఏడు రకాల రిజిస్ట్రేషన్ ను తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతి ప్రదేశంలో పని ప్రారంభించిన మొదటి వారంలోనే పని వివరములు తెలిపే బోర్డును ఏర్పాటు చేయాలని, అధిక డిమాండ్ కలిగిన మొక్కలను నర్సరీలో అభివృద్ధి చేసి, నాటి సురక్షించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి పనుల్లో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంజనీరింగ్ విభాగం అధికారులు అభివృద్ధి పనుల సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందని, పనులు నిరసనకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరగా ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏకరూప దుస్తుల తయారీ కొరకు విద్యార్థిని,విద్యార్థుల కొలతలు ఇప్పటికే తీసుకోవడం జరిగిందని, మెటీరియల్ వచ్చిన వెంటనే తయారు చేయడం జరుగుతుందని, సకాలంలో నన్నితతో కూడిన ఏకరూప దుస్తుల అందించే విధంగా స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రోత్సహించాలని తెలిపారు. వేసవికాలం అయినందున జిల్లా లోని మారుమూల ప్రాంతాలకు సైతం త్రాగునీటి అందించడంలో పంచాయితీ కార్యదర్శుల పనితీరు బాగుందని,పని తీరును బాగుంటేనే,ఇదే విధంగా వేసవిలో పూర్తి అయ్యేవరకు కృషి చేయాలని తెలిపారు. గత శాసనసభ ఎన్నికల్లో పంచాయతీ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు నిర్వహించిన ప్రాంత అభినందనీయమని, ఇదే తరహాలో లోక్ సభ ఎన్నికల నిర్వహణ ను బాధ్యత విధంగా నిర్వహించి,ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సమయంతో పని చేయాలని తెలిపారు. గ్రామంలోని పరిశుద్ధ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ శాతాన్ని పెంపొందినందుకు జిల్లాలోని ఓటర్ అవగాహన కార్యక్రమంలో ఈనెల 15 నుంచి 21 తేదీ వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, వయసు హరిత ఉండి ఓటరు జాబితాలో వివరాలు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకొనేల అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం అందరిచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత వివిధ అధికారులు తదితరులు పాల్గొన్నారు.