డిసెంబర్ 28 నుండి జరిగే ప్రజాపాలన గ్రామసభలను సద్వినియోగం చేసుకోండి

 

పొంగులేటి ప్రధాన అనుచరుడు డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 27 (ప్రజాబలం) కామేపల్లి ఇందిరమ్మ రాజ్యం కొరకు అవినీతికి, పైరవీలకు ఆస్కారం లేకుండా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల అమలు కార్యక్రమం కొరకు ప్రభుత్వం ఈనెల 28 నుండి ప్రజాపాలన గ్రామసభలు ప్రతి గ్రామంలో తండాలలో కార్పొరేషన్ డివిజన్లో మున్సిపాలిటీ వార్డులలో చేపట్టడం జరుగుతుందని, స్వయంగా అధికారులే వచ్చి ప్రజల వద్ద దరఖాస్తులు తీసుకుంటారని, కావున ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీల పథకాల అమలు కోసం సభలను సద్వినియోగం చేసుకోవాలని పొంగులేటి ప్రధాన అనుచరుడు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు.
పండితాపురం లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరితో ప్రజలు విసిగి వేసారి పోయి, తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మి అఖండ విజయం కట్టబెట్టారని, ప్రజల ఆశలను కోరికలను వమ్ము చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 20 రోజుల్లోనే 6 గ్యారంటీల పథకాల అమలు కొరకు శ్రీకారం చుట్టడం జరిగిందని, డిసెంబర్ 28వ తేదీనుండి జనవరి 6 తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు స్వయంగా అధికారులే దరఖాస్తులు తీసుకొని, దరఖాస్తులకు రసీదులు కూడా ఇస్తారని, గత ప్రభుత్వం మాయమాటలతో, ఎన్నికల తరుణంలో మాత్రమే కల్లబొల్లి హామీలు ఇచ్చి, అధికారం వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని, అలాకాకుండా కాంగ్రెస్ పార్టీ హామీలను 100% అమలయ్యేలాగా చర్యలు తీసుకుంటుందని మల్లి బాబు యాదవ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు మేకల మల్లికార్జునరావు, ఎల్ హెచ్ పి ఎస్ మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్, మాజీ సర్పంచ్ బానోతు నరసింహ నాయక్, రైతు సంఘం నాయకులు గుంటుపల్లి వెంకట్రావు, బానోతు శ్రీను, మేకల మహేష్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking