ప్రతిభకు బొల్లారం గ్రామస్తులచే పట్టాభిషేకం.

 

వేములవాడ టౌన్, ( ప్రజాబలం ), వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్, కుమారుడు మహమ్మద్ షారుక్ తెలంగాణ రాష్ట్రంలో మొన్న వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. వేములవాడ మైనార్టీ గురుకుల కళాశాలలో ఒకేషనల్ కోర్సులో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 969/1000 మార్కులతో కాలేజీలో మొదటి ర్యాంకు సాధించినందుకు బొల్లారం గ్రామ మాజీ వార్డు సభ్యులు మురుగం శ్రీలత – అనిల్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరువాల మల్లేశం, పరశురాములు, మహమ్మద్ యూసుఫ్, అశోక్, ప్రవీణ్, గోవర్ధన్, మహేందర్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking