వేములవాడ నియోజకవర్గ బి ఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ.
రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, కోనరావుపేట, ( ప్రజాబలం ), రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో ఇటీవల వడగండ్ల వానకు తీవ్రంగా పంట నష్టపోయిన రైతన్నలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని వేములవాడ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన వేములవాడ రాములు, పసుల జాను, మంగలి కొండయ్య రైతుల పొలాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోనరావుపేట సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మల్యాల దేవయ్య, సింగిల్ విండో చైర్మన్లు బండ నరసయ్య యాదవ్, రామ్మోహన్ రావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కెందే గంగాధర్, వంశీకృష్ణ, గోపు పరుశరాములు, మల్లేశం, నరసయ్య, దేవయ్య, రవి, శివతేజ తదితరులు పాల్గొన్నారు.