ఇంటర్ ఫలితాల్లో లక్షెట్టిపేట గురుకుల విద్యార్థినుల ప్రతిభ

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 25 : తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో లక్షెట్టిపేట తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు విజయ బావుటా ఎగరవేశారని ప్రిన్సిపల్ ఎం.లలిత కుమారి పేర్కొన్నారు.ఇంటర్ సెకండియర్ ఎంపీసీ గ్రూపులో కుమారి జీ. మల్లేశ్వరి 986/1000 మార్కులతో, ఇంటర్ సెకండియర్ బైపీసీ గ్రూపులో కుమారి కామెర రంజిత 989/1000 మార్కులతో, ఇంటర్మీడియట్ సెకండియర్ ఒకేషనల్ గ్రూప్ లో కుమారి తమ్మ అలేఖ్య 994/1000 మార్కులతో,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ఒకేషనల్ గ్రూపులో కుమారి సీ హెచ్. అక్షయ 496/500 మార్కుల తో టాపర్ లు గా నిలవగా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ఎంపీసీ గ్రూప్ లో కుమారి చిట్ల అస్మిత 467/470 మార్కులతో, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము బైపిసి గ్రూపులో కుమారి కోరం అక్షిత 437/440 మార్కులతో కళాశాల టాపర్స్ గా నిలిచారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి నులను కళాశాల వైస్ ప్రిన్సిపల్ కె.మహేశ్వర రావు,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ జి మౌనిక, అధ్యాపక బృందం తదితరులు అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking