ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 16 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట కేంద్ర ప్రభుత్వంచే ప్రతాప్ ఫౌండేషన్ ద్వారా ఉపాధ్యాయులకు సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి పరచుటకు ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ ను అందిస్తున్నట్లు లక్షెట్టిపేట ఎంఈఓ కాసుల రవీందర్ బుధవారం తెలిపారు.స్థానిక జిల్లా పరిషత్ బాలికల పాఠశాల లక్షెట్టిపేటలో దండేపల్లి, జన్నారం,లక్షెట్టిపేట పాఠశాలలకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయుల చొప్పున శిక్షణకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.మొత్తం 65 మంది ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడ్డ రిసోర్స్ పర్సన్ ద్వారా రెండు రోజులు శిక్షణఅందించబడుతుందన్నారు.దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంచే భవిష్యత్తులో సాంకేతిక పరికరాలను పంపిణి చేయబడే పాఠశాలలకు వాటిని ఉపయోగించుటకు ఉపాధ్యాయులకు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుటకు ఇది దోహదపడుతుందన్నారు.ఈ కార్యక్రమము ప్రారంభోత్సవంలో మండల విద్యాధికారి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు యశోదర,ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.