తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా జనరల్ సెక్రెటరీగా ఎస్ ఎస్ గ్రూప్ అధినేత ఏలూరి రాము నియామకం .

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 23(ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రంగారావు ఖమ్మం జిల్లా జనరల్ సెక్రెటరీగా ఎస్ ఎస్ రియల్ ఎస్టేట్ అధినేత ఏలూరి రాము ను నియమిస్తూ నియమక పత్రని అందజేశారు . ఈ సందర్భంగా నియామక పత్రం అందుకున్న ఏలూరి రాము మాట్లాడుతూ గతంలో తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ ముదిగొండ మండల అధ్యక్షుడుగా ఉన్నాని , ప్రస్తుతం తను మామిల్లగూడెం ప్రాంతంలో నివాసము ఉంటున్నాను అని తెలియజేసి యూనియన్ విషయంలో ఏ టైం అయినా అందు బాటు లో ఉంటాను అని తెలిపారు . తన పై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పజెప్పిన రాష్ట్ర కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . శక్తి వంచన లేకుండా రియల్టర్స్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు కృషి చేస్తానన్నాడు. ఈ కార్యక్రమంలో జిల్లా రియల్టర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నం వీరప్రసాద రావు , జిల్లా రియల్టర్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కాటేపల్లి జనార్దన్ రావు , జిల్లా రియాల్టర్ అసోసియేషన్ ప్రచార కార్యదర్శి మాతంగి అనిల్ కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు అల్లిక సంతోష్ యాదవ్ , జిల్లా ఉపాధ్యక్షులు తుప్పతీ శ్రీనివాసరావు , జిల్లా కమిటీ సభ్యులు పాశం నరేష్ , రూరల్ మండలం అధ్యక్షులు బిల్లా సతీష్ బాబు , ఖమ్మం నగర రియల్టర్ అసోసియేషన్ సభ్యులు ఉస్మాన్ , ఖురేషి పాషా తదితరులు పాల్గొని ఏలూరు రాము కు శుభాకాంక్షలు తెలియజేశారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking