వ్యవసాయ రంగంలో తెలంగాణ దూసుకెళ్తుంది

 

ముప్పిరెడ్డిపల్లి లో హార్వెస్టర్ల పరిశ్రమను పరిశీలించిన
మంత్రి నిరంజన్ రెడ్డి.

మెదక్ మనోహరబాద్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ మనోహరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో
వ్యవసాయ రంగంలో తెలంగాణ అన్ని వనరులతో ముందుకు వెళ్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలో నెలకొల్పిన అక్షయ అగ్రి హార్వెస్టర్ల తయారీ పరిశ్రమను అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, స్థానిక సర్పంచ్ ప్రభావతి డా పెంటయ్య,మనోహరబాద్ మండలం ఎంపిపి పురం నవనీత రవి ముదిరాజ్, మండల రైతు సమితి అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షడు పురం మహేష్ ముదిరాజ్, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డిలతో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి సందర్శించారు.
పరిశ్రమ డైరెక్టర్ రాబేష్, మార్కెటింగ్ మేనేజర్ అబ్దుల్, ఆపరేషన్ హెడ్ ప్రశాంత్ లు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి ఆహ్వానించారు. తమ పరిశ్రమ సౌత్ ఇండియాలోనే మొదటిదని, ఆర్ఎన్డీ యూనిట్ 1 పరిశ్రమను దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో నెలకొల్పామన్నారు. ఈ పరిశ్రమలో రైతులకు ఉపయోగపడే వ్యవసాయ రంగంలో హార్వెస్టర్ వరి కోత యంత్రం, మొక్కజొన్న, కందులు తదితర పంటలను కోయడానికి రోటోమీటర్, బన ప్లాస్టర్, క్రషర్స్ తదితర యంత్రాలను తయారు చేస్తామన్నారు.

తయారు చేసిన యంత్రాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక ఆధునిక విధానాలతో తెలంగాణ వ్యవసాయ రంగం ముందుకు వెళ్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు పెద్దపీట వేశారని తెలిపారు. దేశంలో పండిన పంటలను
రాష్ట్రంలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారన్నారు. రాష్ట్రంలో 20 ఎకరాలు, ఆపై ఉన్న రైతులు కేవలం 22 వేలు మాత్రమే అని తెలిపారు. చిన్న, సన్న కారు రైతులు వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చు, తక్కువ సమయంతో అత్యధికంగా దిగుబడి పొందడానికి ఆధునీకరణ పద్ధతిలో వ్యవసాయం సాగు చేసుకోవాలని, ఇందుకోసం ఇలాంటి మెరుగైన యంత్రాలు అవసరమని గుర్తు చేశారు.

వరికోత, ఇతర పరికరాలను అక్షయ ఆగ్రీ వారు తయారు చేసిన విధానం బాగుందని కితాబిచ్చారు. అనంతరం మంత్రి పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆశ కుమారి, మైనింగ్ అధికారి జై రాజ్, తూప్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాష్, వ్యవసాయ శాఖ అధికారులు రాజనారాయణ, రాజశేఖర్, ముప్పిరెడ్డిపల్లి పంచాయతీ పాలకవర్గ సభ్యులు, బిఅర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking