విద్యార్థులకు కాస్మొటిక్, డైట్ చార్జీలను పెంచిన సిఎం రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం కు కృతజ్ఞతలు మహాత్మజ్యోతిరావుపులే వెల్దుర్తి పాఠశాలలో అన్నంబరాన్నంటిన సంబరాలు
వెల్దుర్తి, తూప్రాన్, నవంబర్, 2 ప్రజాబలం న్యూస్ :-
వెల్దుర్తి మహత్మా జ్యోతిరావుపూలే స్కూల్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు 40 శాతం పెంచినదుకు విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి భాణసంచా పేల్చి స్వీట్లు పంచి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా 40 శాతం కాస్మొటిక్, డైట్ చార్జీలను పెంచి పెద్ద మనసుతో అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. థాంక్యూ సి ఎం సార్, థాంక్యూ పొన్నం సార్ అంటూ ప్ల కార్డులు చేతపట్టుకొని నినదించారు. వెల్దుర్తి మహత్మా జ్యోతిరావు పూలే పాఠశాలలో విద్యార్థుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ పాల్ ఏ.అర్.కే వందన తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.