ప్రజాబలం మందమర్రి మండల రిపోర్టర్ నవంబర్ 3 :
మందమర్రి ఏరియా ఎస్ ఓ టు జిఎం గా మందమర్రి ఏరియాలో పనిచేసి భూపాలపల్లి ఏరియా జి ఎం గా పదోన్నతిపై వెళ్తున్న రాజేశ్వర్ రెడ్డిని శనివారం మందమర్రి జి.ఏం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ జి.దేవేందర్ ఏరియా ఉన్నత అధికారులు, యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు.
అనంతరం జిఎం మాట్లాడుతూ మందమర్రి ఏరియాలో ఉత్పత్తి ఉత్పాదకతకు వారు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏరియా ప్రాజెక్ట్ ఆఫీసర్లు, డీజీఎంలు, హెచ్ ఓ డి లు, ఏజెంట్లు,మరియు జిఎం ఆఫీస్ అధికారులు గనుల అధికారులు, డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.