రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహన్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని
జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ
మంత్రి మాట్లాడుతూ…రైతు సంక్షేమంలో భాగంగా మద్దతు ధర నిర్ణయించి రైతుల వద్ద నుండి వరిధాన్యం కొనుగోలు
చేయడం జరుగుతుందని,ఈ క్రమంలో జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని
అధికారులను ఆదేశించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే క్రమంలో తేమ,తప్ప,తాలు ఇతర అంశాలలో
పాటించవలసిన జాగ్రత్తలను వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని,వరి కోత సమయంలో
హార్వెస్టర్ నిర్వాహకుల సమన్వయంతో పని చేయాలని, ఆర్.పి.ఎం.18 నుండి 20 వరకు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని
తెలిపారు.కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు,నీడ, గోదాములు, టార్పాలిన్లు,
గన్నీ సంచులు, తూకం,తేమ యంత్రాలు,ధాన్యం క్లీనర్లు ఇతర అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించే సమయంలో రవాణా, ఎగుమతి దిగుమతిలో హమాలీల
నిర్వహణ ఇతర అంశాలపై పర్యవేక్షించాలని తెలిపారు.రైస్ మిల్లులలో రిజిస్టర్లను స్పష్టంగా నిర్వహించాలని,రైస్ మిల్లర్లతో ఒప్పందాల ప్రక్రియ పకడ్బంధీగా ఉండాలని తెలిపారు. సన్నరకం వడ్లకు ప్రభుత్వం 500 రూపాయల బోనస్ అందిస్తుందని,ఈ క్రమంలో సన్నరకం,దొడ్డురకం వడ్ల సేకరణకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.కొనుగోలు కేంద్రాలు,రైస్ మిల్లర్ల లో ధాన్యం అధికంగా ఉన్న సమయంలో గోదాములలో నిల్వ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, వర్షాభావ,పరిస్థితులలో రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని,రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 15 రోజులలోగా,సంబంధిత రైతుల ఖాతాలలో నగదు జమ చేసే విధంగా బ్యాంకర్లు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.
అనంతరం రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సామాజిక,ఆర్థిక, విద్య,ఉపాధి, రాజకీయ,కుల వివరాలను సేకరించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు,షెడ్యూల్డ్ కులాలు,షెడ్యూల్డ్ తెగలు, ఇతర బలహీన,అన్ని వర్గాల అభ్యున్నతికి సరైన నిర్ణయాలు తీసుకొని అవసరమైన ప్రణాళికలు తయారు చేసి అమలు చేసేందుకు సర్వే చేపట్టబడుతుందని తెలిపారు. జిల్లాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఎన్యుమరేషన్ బ్లాక్లను కేటాయించి కుటుంబాల వివరాలు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.అధికారులు,క్షేతస్థాయి బృందాలు సమన్వయంతో పని చేసి ఎన్యుమరేషన్లో తలెత్తే సమస్యలను పరిష్కరించాలని, వివరాల సేకరణలో గోప్యత,నైతిక ప్రమాణాలు పాటించాలని, కేటాయించిన బ్లాక్ లో అన్ని కుటుంబాలను ఖచ్చితంగా నమోదు చేయాలని,సర్వే సమయంలో కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు, రేషన్ కార్డు,ఒక వేళ వ్యవసాయ భూమి కలిగి ఉన్నట్లయితే ధరణి పాస్ పుస్తకం అందుబాటులో ఉంచుకునేలా తెలియజేయాలని, ఎన్యుమరేటర్లు మార్గదర్శకాలను అనుసరించి సర్వే నిర్వహించాలని, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్ల పనితీరును పర్యవేక్షించి అవసరమైన సహాయాన్ని అందించాలని తెలిపారు.ఈ నెల 6 నుండి 18 వ తేదీ వరకు గుర్తించిన ఇండ్ల నుండి పూర్తి సమాచారాన్ని సేకరించాలని,19 నుండి 27 వ తేదీ వరకు సేకరించిన వివరాలను నిర్ణీత నమూనాలో నమోదు చేయాలని,27 నుండి 29వ తేదీ వరకు వివరాలను పునః పరిశీలించాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ… జిల్లాలో గుర్తించబడిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను దాదాపు ప్రారంభించడం జరిగిందని,కేంద్రాలకు అవసరమైన యంత్రాలు, పరికరాలు అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియలో భాగంగా నియమించిన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో సర్వే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) సబావత్ మోతిలాల్,సంబంధిత శాఖల అధికారులు తదితరులు.