రాజేంద్రనగర్‌ పొలీస్‌ స్టేషన్‌ అధికారులను అభినందించిన సీఎం

రాజేంద్రనగర్‌ ప్రజాబలం ప్రతినిధి: దేశంలోనే అత్యుత్తమ పొలీసు స్టేషన్‌ గా రాజేంద్రనగర్‌ పొలీస్‌ స్టేషన్‌ మొదటి స్థానానికి ఎంపిక కావడం పట్ల ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి పోలీసు అధికారులను అభినందించారు. భారత హొం మంత్రిత్వ శాఖ 2023 సంవత్సరానికి గాను దేశంలోని అత్యుత్తమ పోలీస్‌ స్టేషన్లుగా ఎంపికైన స్టేషన్ల జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో రాజేంద్రనగనర్‌ పోలీస్‌ స్టేషన్‌ మొదటి స్థానం కైవసం చేసుకుంది. శుక్రవారం జైపుర్‌ లో జరిగిన అన్నిరాష్ట్రాల డిజీపీల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేతుల మీదుగా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ బి.నాగేంద్రబాబు ట్రోఫిని అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking