మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-
గద్దర్ సంస్మరణ సభకు తప్పకుండా అందరూ హాజరు కావాలి. న్యాయవాదులు ఎన్ర్డేల్లి వెంకటస్వామి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ వాస్తవ్యులు గద్దర్ సంస్మరణ సభ సోమవారం 28-82023 నాడు ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుందని , ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ గాయకులు ప్రజా ప్రతినిధులు, హాజరవుతున్నారని తూప్రాన్ వాస్తవులు తూప్రాన్ గద్దర్ సంస్కరణ సభ తూప్రాన్ లో జరగడం గర్వకారణం అని తూప్రాన్ కు పేరు దేశంలోనే పేరు తెచ్చిన గద్దర్ మహనీయునీ విగ్రహం తూప్రాన్లో ఏర్పాటు చేస్తామని జరగబోయే సంస్మరణ సభ కు
జనం తరలి రావాలని సీనియర్ హైకోర్టు న్యాయవాదులు , మున్సిపల్ లీగల్ అడ్వైజర్, సౌత్ ఇండియా మానవ హక్కుల సంఘం డైరెక్టర్ అడ్వకేట్ వెంకట్ స్వామి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.