దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల దేనిలో తక్కువ కాదు, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:: సీతక్క.
ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 09 :
దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల దేనిలో తక్కువ కాదని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మరియు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కోన్నారు.
మంగళవారం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో కలెక్టరేట్ ప్రాంగణం లో, ఆడిటోరియం లో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపకరణాలు, ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ సమాజంలో కొందరు పుట్టుకతో, మరికొందరు అనారోగ్యంతో, ఇంకొందరు ప్రమాద కారణంగా దివ్యాంగులుగా కాబడతారని, అటువంటి వారికి ఆలంబన కలిగేలా సమాజం కూడా తోడ్పాటునివాలని సూచించారు. అలాగే శరీరంలో వచ్చే వివిధ రకాలైన మార్పుల కారణంగా ట్రాన్స్ జెండర్లు కాబడతారని వారికి హక్కులు, ఆత్మ గౌరవం ఉంటుందని, సమాజం లో వారు గౌరవం తో జీవించేలా వారికి తోడ్పాటు అందించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. అందులో భాగంగానే
ఈ ఉపకరణాలు,ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని అన్నారు. ఇట్టి సహకారాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన పొంది ఉన్నతంగా ఎదగాలని లబ్ధిదారులకు సూచించారు.
వికలాంగుల సంక్షేమం ప్రతి ఒక్కరి భాధ్యత అని , వీరిని ఆదుకోవాలనే సదుద్దేశంతోనే ప్రభుత్వం ప్రత్యేకంగా 75 కోట్ల రూపాయలను కేటాయించిందని పేర్కొన్నారు.
వారికి కేటాయించిన నిధుల ద్వారా స్వయం ఉపాధి కల్పించడం, లాప్ టాప్ లు, ట్రై సైకిల్ , స్క్యూటీలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
సంక్షేమంలో, విద్యా విభాగంలో, ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం జరిగిందని, ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు లక్ష రూపాయలు రిటైర్మెంట్ కు అందిస్తున్నామని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టిక ఆహారం అదించాలని, అంగన్వాడీ కేంద్రాలకు అందించే వస్తువులు నాణ్యతా ప్రమాణాలు పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని వారి లైసెన్సులు రద్దు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ సభ్యులు పొరిక బలరాం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం చిత్తశుద్ధి తో మహిళలకు పెద్ద పీట వేస్తుందని వారికి ప్రోత్సాహకాలు అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం మొట్ట మొదటిసారిగా ములుగు ప్రాంతంలోనే ప్రారంభించడం జరుగుతుందని, స్థానిక మంత్రి ప్రజల కొరకు నిరంతరం అహర్నిశలు కష్టపడుతుందని ఇలాంటి ప్రజా సేవకురాలు దొరకడం ఇక్కడి ప్రజల అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు 3 రెట్రో ఫిట్టేడ్ మోటార్ ద్విచక్రవాహనాలు, 4 బ్యాటరీ వీల్ చైర్లు మరియు ఇద్దరు ట్రాన్స్ జెండర్ల కు 50 వేల రూపాయలు విలువ గల రెండు చెక్కులను మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు బలరాం నాయక్ తో కలిసి మంత్రి అందించారు.
ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, అదనపు కలెక్టర్ రెవెన్యూ మహేందర్ జీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని స్వర్ణలత లెనైన, మంత్రి OSD మధుసూదన్, జిల్లాలోని CDPO లు, DCPO, DCPU, CHL, సఖి, DHEW సిబ్బంది, లబ్ధిదారులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.