1969 తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారి న్యాయబద్ధమైన డిమాండ్ ను పరిష్కరించాలి

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూలగుండ్ల శ్రీహరి మాట్లాడుతూ 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని వారికి గుర్తింపు కార్డులు , ఆరోగ్య నిమిత్తం కావాల్సిన హెల్త్ కార్డులు , డబుల్ బెడ్ రూమ్ ఇల్లు , పెన్షన్ , బస్సు మరియు రైలు పాస్లు , 69 ఉద్యమకారులుగా గుర్తింపు వున్నవారికి 2 ఎమ్మెల్సీ , ఒక ఎంపీ సీటు ఇవ్వాలని , ప్రభుత్వం నుండి రావల్సిన సంక్షేమ పథకాలు , రాయితులు అందించాలని పైన ఉదహరించిన మా విన్నపాలను మీ పై అధిష్టానానికి విన్నవించి మాకు తగు న్యాయం చేసేవిధంగా మానిఫెస్టో లో పెట్టి ఎవరు మాకు న్యాయం చేస్తే వారికి రాష్ట్ర వ్యాప్తంగా వున్న మా ఉద్యమ కుటుంబాలు ఉద్యమ కారులు మీకు మా ఓటు రూపాన సహకరిస్తామని అన్నారు . తెలంగాణ రాష్ట్రములో 10 జిల్లా ల నుండి 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమములలో చురుగ్గా మేము అందరమూ పాల్గొనాము . ఆనాటి వారందరము తెలంగాణ రాష్ట్రముగా ఏర్పడినాము అనాడు విద్యార్థులు ఉద్యోగులు సకలజనులు కలిసి రాస్తా రోకో ధర్నాలు పికిటింగ్ లు మొత్తం ఒక సంవత్సరం పాటు నిరాహార దీక్షలు బందులు చేస్తూ అరెస్ట్ లు అయినాము . లాఠీ దెబ్బలు తిన్నాము . జైలుకు , సెంట్రల్ జైలుకు వెళ్ళాము . అయిన గత పాలకులు మమ్ములను ఆనాటి నుండి ఈనాటి వరకు మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు . కాబట్టి పై నిర్ణయానికి మేమంతా కలిసి కట్టుగా ప్రెస్ మీట్ ల ద్వారా నిర్ణయించుకున్నాము . రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని అందరికి వినతి పత్రాలు ఇస్తున్నాము . కావున దయతో అంగీకరించి పై విషయాలలో మాకు న్యాయం చేయగలరని కోరారు . ఈ కార్యక్రమంలో గౌర అధ్యక్షులు కుతంబాక శ్రీనివాసరావు , సెక్రటరీ సంగం వీరభద్రం , ఎండి ముజఫర్ద్దీన్ , పసుపులేటి కృష్ణ , ఎన్ రమేష్ బాబు , పొదిలి వెంకటేశ్వర్లు , ఎం అప్పారావు , భవాని సింగ్ , రమి రెడ్డి , సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking