ఈరోజు నేరెళ్ల సీతారాములు విద్యార్థి మిస్సింగ్ కేసు విచారణ హైకోర్టులలో జరిగింది మళ్లీ వచ్చే సోమవారం 20 తారీకు వాయిదా పడింది
మెదక్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా నిజాంపేట మండలం కల్వకుంట గ్రామానికి చెందిన నేరెళ్ల సీతారాంలు హైదరాబాదులో 2005- 06 విద్య సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతూ అట్టి వసతి గృహంలో ఉండేవాడు 2006 సంవత్సరం ఫిబ్రవరి రెండో వారంలోఅనుమానాస్పందంగా అదృశ్యం కావడం జరిగింది. అప్పటినుండి నేటి వరకు విద్యార్థి ఆచూకీ లభించలేదు ఈ కేసుకు సాక్ష ఆధారాలు అనేకం ఉన్న వాటిని లేకుండా చేసి పోలీసులు నేరెళ్ల సీతారాములు ఆచూకీ లభించకుండా చేస్తున్నారని విద్యార్థి ఆచూకీ చెప్పాలని గత కొన్ని రోజుల క్రితం హైకోర్టు లొ కుటుంబ సభ్యులు పిటిషన్ వేశారు నేడు 14 తేదీ మంగళవారం రోజు ఈ కేసు పై హైకోర్టు లో విచారణ కొనసాగింది మళ్లీ వచ్చే సోమవారం 20 తారీకు వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంగా న్యాయవాది మహిపాల్ మాట్లాడుతూ 2007 సంవత్సరంలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన కానీ పోలీసులు పట్టించుకోక పోవడం వల్ల ఈ కేసు ముందుకు సాగలేకపోయిందని పేర్కొన్నారు హైకోర్టు ఆదేశాలను పోలీసులు కచ్చితంగా పాటించి సామాన్యులకు న్యాయం చేయాలని సూచించారు