కన్వెక్షన్ రేట్ పెంచాలి
త్రీ లేయర్ పద్ధతి ద్వారా ఎన్ బీ డబ్ల్యూ ఎస్ ఎగ్జిక్యూట్ చేయాలి
పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 : రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐ,పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ అధికారులతో కమీషనరెట్ లో యూఐ కేసులు,గ్రేవ్ యూఐ లాంగ్ పెండింగ్‌లో కేసుల పరిష్కారం,ఎస్ సి,ఎస్ టీ యూఐ కేసులు, ఉమెన్ ఎగైనెస్ట్ కేసులు,పిఓసిఎస్ఓ కేసుల పరిష్కారం,ఎన్ డి పి ఎస్ యాక్ట్ కేసుల,పెండింగ్ కేసులపై రామగుండము పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ సమీక్షా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసులను త్వరగా డిస్పోజల్ చేయాలన్నారు. పోక్సో,ఎస్సీ,ఎస్టీ గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండడంతో పాటు పూర్తి పారదర్శకంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. ప్రతి సిడి ఫైల్ ను,అందులో ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని,పెండింగ్ ఉన్న సిసి నెంబర్లు తీసుకోవాలన్నారు.ప్రతి ఫైల్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం సిడి ఫైల్ పొందుపరచాలని తెలిపారు.ప్రజలతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని సీపీ అధికారులకు సూచించారు. ప్రతి నేరస్థునికి శిక్ష పడేలా కేసులను పక్కా ఆధారాలతో నమోదు చేయాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ,మహిళలకు సంబంధించిన కేసులను త్వరితగతికన పరిష్కరించాలి.నేరాల నియంత్రణకు విసబుల్ పోలీసింగ్,నిరంతర పెట్రోలింగ్ తో పాటు సాంకేతిక వ్యవస్థ కూడా ఉపయోగించుకోవాలి అన్నారు.పెట్రోల్ కార్ నిరంతరం 24×7 గస్తీ నిర్వహింస్తూ,ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించి డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించి,ప్రజల సమస్యలను చట్టపరిదిలో తీర్చాలని,ప్రజావాణి,సీసీసీ ద్వారా వచ్చిన పిటిషన్ లు త్వరితగతికన విచారణ జరిపి చట్ట పరిధిలో బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి.దానికి సంబందించిన రిప్లై లను పంపించాలి.త్రీ లేయర్ పద్ధతి ద్వారా ఎన్ బీ డబ్ల్యూ ఎస్ ఎగ్జిక్యూట్ చేయాలి మొదట కమీషనరేట్ పరిధిలోని, రెండు రాష్ట్ర పరిధిలో, మూడవ లేయర్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్ ఎన్ బీ డబ్ల్యూ ఎస్ ను విభజించి ఒక ప్రణాళిక ప్రకారం ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ఎగ్జిక్యూట్ చేయాలని సిపి గారు సూచించారు.పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి.ప్రతి పోలీస్ స్టేషన్లో పరిధిలో పాన్ షాప్స్,కిరాణం షాప్స్, స్కూల్స్,కాలేజీ ల వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాల విక్రయాలతో పాటు రవాణాకు పాల్పడుతున్న వారిపై నజరు పెట్టాలని, కేసులు నమోదు చేయాలని సిపి అధికారులకు సూచించారు.ఈ సమావేశం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు,బెల్లంపల్లి ఎసిపి రవి కుమార్ ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు,బెల్లంపల్లి సబ్ డివిజన్ సీఐ లు, సిసి ఆర్ బి ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, ఎస్ఐ లు పాల్గొన్నారు.