బడ్జెట్ లో బీసీలకు అన్యాయం
మెదక్ ప్రజా బలం న్యూస్ :-
మెదక్ జిల్లా కేంద్రం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో సోమవారం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు బిసీ డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు మల్లేశం మాట్లాడుతూ బీసీ సంక్షేమ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులలో బీసీలకు అన్యాయం చేశాయని అన్నారు. రెండు లక్షల 90 వేల 396 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు రెండు శాతం నిధులా అని ప్రశ్నించారు. 6,229 వేల కోట్ల నుండి 50 వేల కోట్లకు. పెంచాలని డిమాండ్ చేశారు. 45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ లో బిసిలకు రెండు శాతం నిధులని అన్నారు. రెండువేల కోట్ల నుండి లక్ష కోట్లకు పెంచాలని అన్నారు. దేశ వ్యాప్తంగా జరిగే జాతి జనగణనలో బీసీల కులగణనను వెంటనే చేపట్టాలని అన్నారు.. బిహార్ ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలో బీసీ కులగణన చేపట్టాలని అన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 29 శాతం నుండి 50 శాతానికి పెంచాలని తెలిపారు. బిసీల డిమాండ్లపై ఇటు అసెంబ్లీలో అటు పార్లమెంటులో తీర్మా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ జిల్లా ఉపాధ్యక్షుడు
గడ్డం ప్రశాంత్ కుమార్, రాష్ట్ర నాయకులు శివక్రీష్ణ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం యువజన డివిజన్ అధ్యక్షుడు గుండు ప్రశాంత్, జిల్లా నాయకులు శివ కుమార్, చింతల సిద్దు, గోపాల్ ముదిరాజ్, సత్యనారాయణ, కళ్యాణ్, శివకృష్ణ, ప్రవీణ్ కుమార్, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.