దేశానికి స్ఫూర్తిగా కంటి వెలుగు

కంటి వెలుగు కార్యక్రమంపై కొనియాడిన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని పోతాన్ శెట్టి పల్లిలో ప్రారంభించిన మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు

చేగుంట: ..తెలంగాణ లో రెండవ విడత కార్యక్రమంలో ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తుందని మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు పేర్కొన్నారు.. చేగుంట మండలంలోని పోతాన్ శెట్టిపల్లి గ్రామంలో కంటివేలుగు కార్యక్రమంను ఆయన ప్రారంభించారు..ఈసందర్భంగా ఎంపీ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ గారి ఆలోచన, రాష్ట్ర అభివృద్ధి , ప్రజల సంక్షేమం కొరకే ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు కొట్లాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు…..రాష్ట్రంలోని పేద ధనిక కులమతాల తేడా లేకుండా అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు..కంటి వెలుగు కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికే స్ఫూర్తి గా నిలుస్తుందన్నారు…50 ఏళ్ళు పైబడిన వారికి కంటి సమస్యలు రావడం జరుగుతుందని…కావున మన గ్రామానికి వైద్యబృందం రావడం జరుగుతుందని కంటి పరీక్షల తో పాటు ఉచితంగా శస్త్ర చికిత్సలు, మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు..గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు అంతత మాత్రమే అందుతున్న సందర్భంలో..కంటి వెలుగు కార్యక్రమం మన గ్రామంలో నిర్వహిస్తున్నారు కావున వారు సద్వినియొగం చేసుకోవాలన్నారు…ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని..కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.అనంతరం బోనాల గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమంను ఎంపీ గారు పరిశీలించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking