ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయ సమీపంలో ఒక లారీలో సుమారు 50 గోమాతలను తరలిస్తుంటే హైందవ కార్యకర్తలు,స్థానికులు పట్టుకున్నారు.గురువారం స్థానికులు మాట్లాడుతూ… అక్రమంగా లారీలు తరలిస్తున్న గోవులను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.గోమాతలను రక్షించే బాధ్యత అందరి మీద ఉందని వారు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ…డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ హైందవ ధర్మ రక్షక్ దళ్ జాతీయ సమన్వయ కర్త,స్థానికులు ఎస్సై తెలపడంతో వేంటనే దండేపల్లి ఎస్సై సాంబ మూర్తి వంచి విచారణ చేయగా వారు ఆసిఫాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా లారీ ఎంపి 29 టిబి 3519 గల నెంబర్ గోవులు సుమారు 50 వుంన్నాట్లు తెలుపారు.