ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణ ఆర్ ఎమ్ పీ డాక్టర్ అసోసియేషన్ సభ్యులు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.శనివారం ఈ సందర్భంగా ఆర్ ఎమ్ ఫీ సభ్యులు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మా వంతుగా కృషి చేస్తామని చెప్పారు.ఈ సారి మంచిర్యాల ప్రజలు ఒక అవకాశం ఇవ్వాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బియ్యల వెంకటేష్,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.