పది రోజులు కూడా కాలేదు అప్పుడే విమర్శల
ప్రతి హామీని నెరవేర్చుతాం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 13 (ప్రజాబలం) ఖమ్మం అధికారం కోల్పోవడంతో బిఆర్ఎస్ నేతలంతా మతి భ్రమించి మాట్లాడుతున్నారని పది రోజులు కూడా కాని ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ ద్వజమెత్తారు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పిన వారి తీరు మారడం లేదని పోటీలో గెలుపు ఓటములు సహజమని అవసరం ఐతే ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి గానీ విమర్శించడమే పని గా పెట్టుకొని ప్రభుత్వం పై పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసి ప్రభుత్వ సంస్థలను ప్రక్షాళన చేస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గు చేటని అన్నారు. కాంగ్రెస్ పై నమ్మకం ఉంచే ప్రజలు అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఈ ప్రజా ప్రభుత్వంలో వారికి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటీ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభించారని స్పష్టం చేశారు అనంతరం పోట్ల నాగేశ్వర్ రావు, బాలసాని లక్ష్మీనారాయణ, రాయల నాగేశ్వర్ రావులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ సంక్షేమాన్ని ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా పని చేస్తున్న ప్రభుత్వంపై ప్రతి పక్ష నేతలు విషం చిమ్ముతున్నారని అన్నారు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మాని ప్రజలపై ప్రజా సంక్షేమానికి సలహాలు సూచనలు ఇవ్వాలని కోరారు