విద్య ,వైద్య, సామాజిక అవసరాలకు సిఎస్ఆర్ నిధులు కేటాయించాలి.
సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన అసంపూర్తి పనులు వెంటనే పూర్తి చేయాలి.
జిల్లా అధికారులు పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రి సమీక్ష.
….రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
సంగారెడ్డి సెప్టెంబర్ 13 ప్రజ బలం ప్రతినిధి:
జిల్లా అభివృద్ధికి జిల్లాలోని పరిశ్రమలు సిఎస్ఆర్ నిధులు రెండు శాతం విధిగా అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు తో కలిసి జిల్లాలోని భారీ, మధ్య తరహా ,చిన్న పరిశ్రమల ప్రతినిధులు యాజమాన్యాలతో సి ఎస్ ఆర్ నిధుల కేటాయింపు పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడారు.
అన్ని పరిశ్రమలు రెండు శాతం సి ఎస్ ఆర్ నిధులు వెంటనే అందజేయాలని యాజమాన్యాలకు సూచించారు.
గతంలో సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీల ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. సిఎస్ఆర్ నిధులతో జిల్లాలో విద్య, వైద్య సామాజిక రంగాలలో మౌలిక వసతుల మెరుగు నిధులు కేటాయించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ట్రైనీ కలెక్టర్ మనోజ్, పరిశ్రమల శాఖ అధికారులు, విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు ప్రతినిధులు, పాల్గొన్నారు.