అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసిన దివ్యాంగ సంఘాల సమాలు సదస్సు
హైదరాబాద్ ఏప్రిల్ 24 ();రాజ్యాధికారంలో దివ్యాంగుల భాగస్వామ్యం కల్పించాలని దివ్యాంగ సంఘాల సమాలు సదస్సుఅన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసింది.హైదరాబాద్ ఆబిడ్స్ లోని సూర్య లోక్ కాంప్లెక్స్ లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ నేషనల్ దివ్యాంగ్ జన విభాగం ప్రెసిడెంట్ శివలింక నాగ ఉజయలక్ష్మి ఆధ్వర్యంలో దివ్యాంగ సంఘాలతో సమాలోచన సదస్సు జరిగింది. ఈ సదస్సు లో 16 దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈసదస్సులో దివ్యాంగుల సమస్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఉదయలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగుల చట్టాలు అమలు చేసే విధానం హక్కుల సమస్యల గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని విమర్శించారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ దివ్యాంగుల సామాజిక వర్గం కోసం కృషి చేస్తుందని అన్నారు. అన్ని దివ్యాంగ సంఘాల సంఘాలు ఐపిసికి మద్దతిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. సభకు అధ్యక్షత వహించిన నండూరి రమేష్ మాట్లాడుతూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో దివ్యాంగుల గురించి ఐపిసి చేస్తున్న కృషిని అభినందించారు. అన్ని దివ్యాంగ సంఘాలు ఇది మంచి పరిణామం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దివ్యాంగ సంఘాలు ఐపిసి పార్టీ నాయకులు పాల్గొన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగ నాయకులతో చర్చలు జరిపి కేంద్ర స్థాయిలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ దిశా నిర్దేశ నిర్ణయిస్తుందని ఉదయలక్ష్మి తెలిపారు.
Next Post