కేంద్ర ప్రభుత్వ కుల గణనకు రాహుల్ గాంధీ పట్టుదలే కారణం. వేములవాడ కాంగ్రెస్ శ్రేణులు.

హనుమాజీపేటలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మంత్రుల, ప్రభుత్వ విప్ చిత్రపటాలకు పాలాభిషేకం.

వేములవాడ టౌన్,( ప్రజాబలం ), దేశవ్యాప్తంగా కుల గణనకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో, ఇది కేవలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పట్టుదల వల్లే సాధ్యమైందని వేములవాడ రూరల్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. గురువారం రోజున హనుమాజీపేట గ్రామంలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, వేములవాడ శాసనసభ్యుడు ప్రభుత్వా విప్ ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ గతంలో భారత్ జోడో భరోసా యాత్రలో కుల గణన పై మునుపెన్నడూ లేని స్థాయిలో చర్చకు తెర తీశారు. సామాజిక న్యాయం కోసం చేసిన అతని పోరాటం ఫలించింది. మోడీ ప్రభుత్వం దిగివచ్చి కుల గణనకు ఆమోదం తెలిపింది అని ఆయన వ్యాఖ్యానించారు. కుల గణన ద్వారా దేశంలో వాస్తవిక సామాజిక స్థితిగతులు తెలుస్తాయని, అందువల్ల ప్రభుత్వాలు నూతనంగా రూపొందించే సంక్షేమ పథకాలు, విధానాలు లక్ష్యసాధికారతతో ఉండగలవని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తీగల ఎల్లయ్య, జిల్లా డిసిసి కార్యదర్శి బాలసాని శ్రీనివాస్ గౌడ్, రూరల్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ చిలుక ప్రభాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ్యక స్రవంతి – హరి నందన్ రెడ్డి, నాయకులు గోవర్ధన్ రెడ్డి, ఇరువాల మల్లేశం, సయ్యద్ ఆదిల్ పాషా, చింతలపూడి రాజు, దశరథం, చంద్రం శ్రీనివాస్, జంకే సత్తయ్య, రాజు, భూమయ్య, ఎల్లయ్య, మల్లేశం, నారాయణ, కైలాసం, అనిల్ జావేద్, సంపత్, శారద, బొల్లారం, హనుమాజీపేట గ్రామాలకు చెందిన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking