ఓటు హక్కు అందరికీ సమానం,

భారత రాజ్యాంగం చాలా గొప్పది,

భారత రాజ్యాంగం ద్వారానే భారత ఎన్నికల సంఘం ఏర్పాటు,

ప్రజా స్వామ్యంను కాపాడవలసిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది,

ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది- బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి,

పోలింగ్ డే ను పండుగలా నిర్వహించాలి,

రాష్ట్రం లో పోలింగ్ నమోదు లో ద్వితీయ స్థానం,

ఓటరు నమోదు లో B.L.O ల సేవలు బేష్,

—–జిల్లా కలెక్టర్ రాజర్షి షా .

మెదక్ జనవరి 25 ప్రాజబలం న్యూస్:-

జనవరి 25 జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా గురువారం పోస్ట్ ఆఫీసు నుంచి స్థానిక కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్లు వేంకటేశ్వర్లు , ముఖ్య అతిధులుగా హజరయ్యారు . ఓటరు చైతన్య రథంను జెండా ఊపి ప్రారంభించారు.

ర్యాలీ అనంతరం కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ
స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ధితో కూడిన సుస్థిర ప్రజాస్వామ్యాన్ని ఒక్క ఓటుతొనే సాధించుకోగలమని, అలాంటి ఓటింగ్ డే ను మనందరం పండుగలా నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

2011 సంవత్సరం జనవరి 25వ తేదీన ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ఏర్పాటైన సందర్బంగా ప్రతి సంవత్సరం ఈరోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మనదేశ స్వాతంత్య్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసారని, అలాంటి దేశ అభివృద్దిని ప్రజాస్వామ్య పద్దతిలో ప్రజల చేత, ప్రజల కొరకు పరిపాలనను నడిపే వ్యక్తిని చట్టబద్ధంగా ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడంలో అందరు ముందుండాలని అన్నారు. ఓటు నైతిక విలువలతో కూడిన దని, దానిని ప్రలోభాలకు,స్వలాభా ల కొరకు వినియో గించుకోకుడదని అన్నారు.

జిల్లాలో అర్హులైన వారందరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా విసృతంగా స్వీప్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ల కొరకు హోం ఓటింగ్ విదానాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, కొన్ని చోట్ల ఓటర్లలో చైతన్యం కొరకు, వికలాంగులు తమకు కల్పించిన హోమ్ హోటింగ్ ను సద్వినియోగం చేసుకోకుండా స్వయంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికే అసక్తి చూపారని తెలిపారు.


ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలో భారత ఎన్నికల కమిషన్ మార్గనిర్దేశం చేస్తుండడం గొప్ప విషయమన్నారు. 16 దేశాలలో అక్కడ ఎన్నికల నిర్వహణపైన భారత ప్రజాస్వామ్యం దిశానిర్దేశం చేయడం చాలా గర్వకారణమన్నారు. ఇంతటి ఘనత గల భారతదేశంలో ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత వాతావరణంలో గత నెలలో శాసనసభ నియోజకవర్గ ఎన్నికలను నిర్వహించుకున్నామని, ఇదే స్ఫూర్తితో రాబోవు పార్లమెంట్ ఎన్నికలను జరుపుకుందామని అన్నారు.పోలింగ్ నాడు ఓటువేసిన ఓటరు ఎడమచేతి చూపుడు వేలుకు వేసే సిరా భారతదేశంలో తయారవుతుంది దీనిని ఇతర దేశాలు కూడా మనదగ్గర నుండే తీసుకుoటాయని తెలిపారు. ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు (రెవిన్యూ ) మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓటింగ్ లో ముందు వరసలో వుంటున్నారని , పట్టణ ప్రాంతాలవారు , విద్యావంతులు ఓటుకు దూరంగా వుంటున్నారని , విద్యావంతుల్లో మార్పురావాలని , విద్యావంతులే గ్రామీణ ప్రాంతాలల్లో ఓటరు చైతన్యం తీసుకువచ్చి మంచిసమాజం ఏర్పడటానికి కృషిచేయాలని అన్నారు . భారత రాజ్యాంగం ద్వారా కల్పించబడిన ఓటుహక్కును ఎవరు ప్రలోబాల కు, వర్ణ బేషజాల కు తావులేకుండా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టరు రమేష్ మాట్లాడుతూ ఓటుహక్కును సద్వినియెగం చేసుకోవడానికి ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేసి అర్హులైన వారిని ఎన్నుకోవాలని అన్నారు. స్వేచ్ఛగా, బాధ్యతగా ఓటు వేయాలన్నారు. నర్సాపూర్ మండలం, చిప్పలకుర్తి గ్రామం కె జి వి బి పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నుక్కడ్ నాటకానికి రాష్ట్రస్థాయిలో ప్రధమ బహుమతి గౌరవ రాష్ట్ర గవర్నర్ గారి చేతులమీదిగా అందుకోవడం గర్వంగావుందన్నారు , విద్యార్థులకు అభినందనలు తెలిపారు , అనంతరం కార్యక్రమంలో పాల్గొన్నవారందరితో ఓటు ప్రతిజ్ఞను చేయించారు. జిల్లాలో వివిధ కళాశాలలో స్వెవ్ కార్యక్రమాలపై నిర్వహించిన వ్యాసరచన , ఉపన్యాస , చిత్ర లేఖనం పోటీలలో విజేతలకు బహుమతులు ప్రధానంచేసారు . నూతన ఓటర్లకు ఎపిక్ కార్డులను జిల్లా కలెక్టర్ అందజేశారు.
.

జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ , మెదక్ ఆర్ డి ఓ అంబదాస్ రాజేశ్వర్ , జిల్లా సైన్సు అధికారి రాజిరెడ్డి , ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ హర్దీప్ సింగ్ , వివిధ కళాశాలల ప్రిన్స్ పల్స్ , బి ఎల్ ఓ సూపెర్వైజర్లు , బి ఎల్ ఓ విద్యార్థులు , సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking