యువతలో నైపుణ్యతను పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

ఖమ్మం ప్రతినిధి జనవరి 25 (ప్రజాబలం) ఖమ్మం యువతలో నైపుణ్యతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ ప్రోడాక్ట్విటీ కౌన్సిల్‌ మరియు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో 41 రకాల కంప్యూటర్‌ కోర్స్‌ లను యాప్‌ ద్వారా ఆన్లైన్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశలు కల్పించడం జరగుచున్నదని ఖమ్మం జిల్లా అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ పి.వి.కె. శాస్త్రి, ఎపిపిసి ప్రాజెక్ట్‌ ఇన్చార్జి డి. ప్రకాష్‌లు తెలిపారు. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ ప్రొడక్ట్విటీ కౌన్సిల్‌ (ఏపిపిసి) ట్రైనింగ్‌ డిపార్ట్మెంట్‌ తెలంగాణ భవన నిర్మాణ కార్మికశాఖ లో నమోదు అయిన కార్మికుల పిల్లలకు ఉచితంగా కెరీర్‌ గైడెన్స్‌ మరియు రెస్యూమ్‌ ప్రిపరేషన్‌ గురించి ఖమ్మం ఎస్‌ఆర్‌అండ్‌బిజిఎన్‌ఆర్‌ గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గురువారం 25-01-2024 నాడు వర్క్‌ షాప్‌ నిర్వహించారు యువతనుద్దేశించి అసిస్టెంట్‌ కార్మిక శాఖ అధికారి మాట్లాడుతూ యువతలో నైపుణ్యం కొరతను తీర్చడం కోసం ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ ప్రోడాక్ట్విటీ కౌన్సిల్‌ మరియు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో 41 రకాల కంప్యూటర్‌ కోర్స్‌ లను యాప్‌ ద్వారా ఆన్లైన్‌ లో ఉచితంగా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశలు కల్పించడం జరుగుతుందని అన్నారు. ఎపిపిసి ప్రాజెక్ట్‌ ఇన్చార్జి డి. ప్రకాష్‌ మాట్లాడుతూ ఏపీపీసీ మరియు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ శిక్షణ ను విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోని ఉపాధి అవకాశలు మెరుగు పరుచుకోవాలి అన్నారు అనంతరం శిక్షణ కార్యక్రమంలో ప్రోజెక్ట్‌ లీడ్స్‌ దాసరి రాజేంద్ర, మండవ వంశీకృష్ణ వారి సిబ్బంది పాల్గొని 222 మంది విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్స్‌ అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking