రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 2025
ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన మణికొండకు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. జనాభా ప్రాతిపదికన జరిగిన డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ నార్సింగి కన్నా ఎక్కువ జనాభా ఉన్న మణికొండకు రెండు డివిజన్లు కేటాయించడంతో పాటు మణికొండ పేరుకు మచ్చ తెస్తూ, పుప్పాలగూడ పేరు మొత్తానికి లేకుండా చేస్తూ, మణికొండలో నూతనముగా నిర్మించిన ఆఫీస్ భవనానికి నార్సింగ్ సర్కిల్ పేరు తగిలించడం తీవ్ర అన్యాయం చేసినట్టే. ప్రస్తుత కాలంలో దేశాన్ని ఏలుతున్న జాతీయ రాజకీయ పార్టీ మరియు రాష్ట్రములో ఏలుబడి కావిస్తున్న రాజకీయ పార్టీలు జతకుడి గత ఐదు సంవత్సరములు మణికొండను పాలు పంచుకొని పాలన సాగించి ఓరుగ బెట్టినది ఏమీలేదని అందుకు తోడు మణికొండ పేరు లేకుండా జరిగిన పరిణామాలకు స్థానిక కాంగ్రెస్ నాయకుల అసమర్థతనే కారణమని, అందుకు ప్రతీకారంగా రాబోయే తరుణములో కానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మణికొండ ప్రజానీకం ముక్త కంఠంతో ఓటు రూపంలో అధికారిక కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మణికొండ బి.ఆర్.ఎస్ పార్టీ స్థానిక నాయకులు గుట్టమీది నరేందర్, ఉపేంద్రనాథ్ రెడ్డి, ఏర్పుల శ్రీకాంత్, సంగం శ్రీకాంత్, గోరుకంటి విఠల్, యాలాల కిరణ్, మహమ్మద్ ఆరిఫ్, సుమనళిని, బండమీది మల్లేష్, బొడ్డు శ్రీధర్, చెరుకూరి బాలాజీ, సంపత్, సుమన్, నరేష్, మహేందర్ తది తరులు మణికొండ స్థానిక ప్రజానీకానికి పిలుపునిచ్చింది.