మహిళా చైతన్య స్ఫూర్తి సావిత్రీబాయి ఫూలే

 

కక్కిరేణి గ్రామంలో మహిళల కు చదువు నేర్పిన మొదటి గురువు సావిత్రిబాయి పూలే గారి 193 వ జయంతి కార్యక్రమంను ప్రాథమిక పాఠశాలలో , మరియు ఎర్రగడ్డ సెంటర్లో మహిళలతో ఘనంగా పూల మాలలు వేసి నివాళులర్పించడం జరిగింది..
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. కనకసేన గారు మాట్లాడుతూ
విద్య ద్వారా సమాజంలో ఉన్న అసమానతలను చదును చేయాలని… 18వ శతాబ్దంలోనే మహాత్మ జ్యోతి రావుఫూలే, సావిత్రీబాయి ఫూలే దంపతులు మొక్కవోని దీక్ష వల్ల అప్పటి సమాజంలో హీన స్థితిలో ఉన్న స్త్రీల జీవితాలకు అండ దొరికిందనీ. సమాజంలో ఉన్న రుగ్మతలను నువ్వు కూడా రూపుమాపడానికి విశేష కృషి చేసిన తన భర్త జ్యోతిబా ఫూలే ప్రోత్సాహంతో స్వయంగా చదువుకున్న సావిత్రీబాయి దేశంలో మహిళా విద్యకు దారిదీపమై చైతన్య వెలుగులు నింపారని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి , గణేష్ , యోగితా బాలీ, భార్గవి సామాజిక కార్యకర్త వేముల సైదులు , ఈదులకంటి శివకుమార్ , నిమ్మనగోటి సైదులు , గ్రామ మహిళలు దుర్గమ్మ , పద్మ , అండాలు ,లక్ష్మీ వసంత , దేవయాని , , అనసూర్య , సుభద్ర , ధనమ్మ నరసమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking