కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ నామ క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణ బీఆర్ఎస్ జిల్లా నాయకులు జీవన్ కుమార్, చిత్తారు సింహాద్రి యాదవ్ తదితరులు
ఖమ్మం ప్రతినిధి జనవరి 03 (ప్రజాబలం) సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు సోదరుడు నున్నా రమణ ఇటీవల అకాల మరణం పొందిన తరుణంలో బుధవారం ఖమ్మంలోని సీక్వెల్ లో జరిగిన పెద్దకర్మ కార్యక్రమానికి ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయం నుంచి పలువురు హాజరై రమణ చిత్ర పటానికి పూల మాల వేసి,సంతాపం తెలిపి ఘనంగా నివాళులర్పించారు.కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు తాళ్లూరి జీవన్ కుమార్ ఎంపీ నామ నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయం ఇంచార్జ్ కనకమేడల సత్యనారాయణ సీపీఎం జిల్లా నాయకులు బండి రమేష్ జిల్లా టెలికాం సలహా మండలి సభ్యులు చిత్తారు సింహాద్రి యాదవ్ తాళ్లూరి శ్రీకాంత్ నామ సేవా సమితి నాయకులు చీకటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.