వీడియో జర్నలిస్టు పై దాడి చేసిన ఎస్సై ని తక్షణమే సస్పెండ్ చేయాలి గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ డిమాండ్.
ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా జూన్ 17:మంత్రి కేటీఆర్ పర్యటనలో కవరేజ్ వీధుల్లో ఉన్న ఈటీవీ కెమెరామెన్ వెంకటేష్ పై అకారణంగా దాడికి దిగిన రిజర్వుడ్ ఎస్ఐ భాను ప్రసాద్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు వేముల నాగరాజు,బొల్లారపు సదయ్య, కోశాధికరి అమర్,గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కార్యవర్గం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది.లైవ్ విధుల్లో ఉన్న వీడియో జర్నలిస్ట్ పై అకారణంగా దాడి చేసి కెమెరా లైవ్ కిట్టు లాక్కొని గొంతు పట్టుకుని నెట్టు వేసిన ఎస్ఐ భాను ప్రసాద్ పై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఎస్ఐపై చర్యలు తీసుకుని ఎడల ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని వారు హెచ్చరించారు.