జిల్లా అదనపు కలెక్టర్ డి మధుసూదన్ నాయక్
ఖమ్మం ప్రతినిధి మార్చి 2 (ప్రజాబలం) ఖమ్మం మహనీయుల జీవితాల నుంచి మనం అనేక వ్యక్తిత్వ వికాస పాఠాలను నేర్చుకోవచ్చని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. శనివారం అదనపు కలెక్టర్, నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలలో పాల్గొన్నారు. దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా ఉపాధికల్పన అధికారి కె. శ్రీరామ్, దుద్దిళ్ల శ్రీపాదరావు జీవిత ప్రస్థానాన్ని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మారుమూల ప్రాంతమైన ధన్వాడలో పుట్టి శాసనసభ స్పీకర్ స్థాయికి ఎదిగిన మహనీయులు దుద్దిల శ్రీపాదరావు అని, ప్రతి ఒక్కరితో మంచిగా వ్యవహరిస్తూ తన జీవితం కొనసాగించారని అన్నారు. న్యాయవాదిగా వృత్తి కొనసాగిస్తున్న సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ స్పీకర్ స్థాయికి ప్రజల ఆశీర్వాదంతో ఎదిగారని, నమ్ముకున్న సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న వ్యక్తి శ్రీపాద రావు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఏ. శ్రీనివాస్, జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి కె. సత్యనారాయణ, జీఎం ఇండస్ట్రీస్ అజయ్ కుమార్, ఏడి ఫిషరీస్ ఆంజనేయ స్వామి, కలెక్టరేట్ పరిపాలన అధికారిణి అరుణ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.