ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 08 క్రీడా రంగంలో జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో రాణించి మంచిర్యాల జిల్లాను ముందంజలో ఉంచాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.శనివారం జిల్లా క్రేంద్రంలోని గ్రీన్ సీటీ లో గల మాస్టర్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు బి రాహుల్ తో కలిసి ప్రారంభించి బ్యాడ్మింటన్ అడారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులను ప్రోత్సాహిస్తూ క్రీడా రంగంలో తీర్చిదిద్దడం అభినందనీయమని అన్నారు. జిల్లా క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిరి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.అనంతరం జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన,జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొన్న క్రీడాకారులను మెమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్,ముఖ్య సలహాదారు గాజుల ముఖేష్ గౌడ్, కోశాధికారి సత్యపాల్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి రమేష్ రెడ్డి,కార్యవర్గ సభ్యులు,క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.