నేడే సిపిఎం కరీంనగర్ పార్లమెంట్ స్థాయి సమావేశం.

  • ఎన్నికల మేనిఫెస్టో బుక్ లెట్ విడుదల చేసిన సిపిఎం.

కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి మే 6 ఈరోజు స్థానిక కోతి రాంపూర్ లోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో సిపిఎం పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో బుక్ లెట్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ మంగళవారం ఉదయం 10 గంటలకు సిపిఎం కరీంనగర్ పార్లమెంట్ స్థాయిసమావేశాలు జరుగుతున్నాయని పార్టీ సానుభూతిపరులు సభ్యులు ముఖ్య నాయకత్వం హాజరై విజయవంతం చేయాలని అన్నారు. కేంద్రంలో గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిజెపి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్మి వేసిందని,తనకు కుటుంబమే లేదంటున్న మోడీ అంబానీ, అదాని లాంటి కార్పొరేట్ కంపెనీ తన కుటుంబం అని ప్రజలు కష్టపడి కట్టిన పన్నులను, ప్రభుత్వ రంగ సంస్థలను, దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అమ్ముతున్నారని ఎద్దేవా చేశారు.బిజెపి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బహిరంగ వేదికల ద్వారానే చెబుతున్నారని భారత దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రమాదం తొలగించే విధంగా బిజెపి వ్యవహరిస్తుందని అన్నారు. మళ్లీ బిజెపి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఎత్తివేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తీవ్ర నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపిని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక నిత్యవసర సరుకులు ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగాన్ని పెంచి పోషించిందని, ఆకలి సూచిక పట్టికలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపడానికి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలే కారణమని అన్నారు.
కమ్యూనిస్టులు బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థి వెలిచాలా రాజేందర్ రావు గెలుపుకు కృషి చేయాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమని అన్నారు.
నగరంలోని ముకుందలాల్ మిశ్రా భవన్ లో జరిగే సిపిఎం కరీంనగర్ పార్లమెంటు స్థాయి సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గేట్ల ముకుంద రెడ్డి, వర్ణ వెంకటరెడ్డి గుడి కందుల సత్యం, జి.బీమా సాహెబ్, జిల్లా కమిటీ సభ్యులు యు. శ్రీనివాస్, ఎడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking