ఖమ్మం గుమ్మం నా వెలసిన అతిపెద్ద వస్త్ర, అభరణాల షోరూం
ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ రాజకీయ ప్రముఖులు
ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 01 (ప్రజాబలం) ఖమ్మం గుమ్మం నా అతిపెద్ద వస్త్ర, అభరణాల షోరూం నేడు ప్రారంభానికి సిద్ధమైంది. ఖమ్మం బైపాస్ రోడ్ లోని కొత్త బస్టాండ్ సమీపంలో అధునాతన హంగులతో నిర్మించిన ది చెన్నై షాపింగ్ మాల్ అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం కానుంది ప్రముఖ సినీ తార కృతి శెట్టి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా 17 వ షోరూం ఆవిష్కృతం కానుంది.
విశాలమైన పార్కింగ్, లెక్కకు మించి వెరైటీలు, సరికొత్త డిజైన్లతో మగువల మనసు దోచే పట్టు ఫ్యాన్సీ, కిడ్స్, మెన్స్ వేర్, సరి కొత్త డిజైన్లతో రూపొందించిన జ్యుయలరీ అతి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి.
ఈ కార్యక్రమానికి ది చెన్నై షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ మర్రి వెంకటరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మర్రి శశిధర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఖమ్మం మేయర్ పూనుకోలు నీరజ పలువురు నగర ప్రముఖులు, తదితరులు హాజరుకానున్నారు. ఖమ్మంలో అంగరంగ వైభవంగా చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుక శనివారం అట్టహాసంగా ప్రారంభం కానుంది ఈ ప్రారంభ వేడుకకు అందరూ ఆహ్వానితులే ఆదరించండి వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేయండి.