అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు తొగరు రాజు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 03 : ఈ నెల 14న డా,,బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని అంబేద్కర్ యువజన సంఘం పట్టణ అధ్యక్షులు తొగరు రాజు పేర్కొన్నారు.బుధవారం పట్టణంలోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో అంబేద్కర్ యువజన సంఘం పట్టణ కమిటీ తొగరు రాజు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అంబేద్కర్,జ్యోతిబా పూలే తదితర నాయకుల జయంతులు,వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లంపల్లి రమేష్, గుత్తికొండ శ్రీధర్,చుంచు రమేష్,పెండెం సత్తయ్య, లింగంపల్లి సుధాకర్, పెండెం రాజశేఖర్, మామిడి సందీప్, సామనపల్లి దుర్గాంజనేయ, చాతరాజు రాజేష్, బోలిశెట్టి సందీప్, జక్కుల రాజలింగు,కూశనపల్లి భానుకుమార్, మంచాల కుమార్,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking