పన్ను చెల్లించండి రాయితీ పొందండి.
పట్టణాభివృద్ధి సహకరించండి
కమిషనర్ ఖాజా మోహినోద్దిన్.
తూప్రాన్, ఏప్రిల్, 3. ప్రజా బలం న్యూస్ :- తూప్రాన్ మున్సిపల్ పరిధలోని ప్రజలకు గొప్ప సదవకాశం కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఖాజా మోహిజొద్ధిన్ మీడియా సమావేశంలో తెలిపారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరం నకు అస్థి పన్ను, (ప్రాపర్టీ టాక్స్), ఇంటి పన్ను, చెల్లించే మొత్తం నుంచి 5% ఐదు శాతం మినహాయింపు రాయితీ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి అవకాశం ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లించి ఐదు శాతం పన్ను రాయితీ పొందవచ్చని సూచించారు. అదే విధంగా ఇంటి పన్ను తోపాటు నల్లా బిల్లులు, ట్రేడ్ లైసెన్స్ పీజులు, అడ్వర్టైజ్ మెంట్ ఫీజులు మున్సిపల్ ఆఫీస్ లోని బిల్ కలెక్టర్, లేదా కౌంటర్ లో లేదా సి.డి.ఎం.ఎ వెబ్ సైట్ లో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీ మేనేజర్ రఘువరన్, అర్.ఐ రమేష్, దుర్గయ్య, ప్రశాంత్, మమత, వార్డు బాయ్స్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు .