మద్యం సేవించిన వారికి ట్రాఫిక్ ఎస్ ఐ కౌన్సిలింగ్

 

జగిత్యాల, ఆగస్టు 19: జగిత్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న 34 మంది మందుబాబులకు ట్రాఫిక్ ఎస్.ఐ రామచంద్రము కౌన్సిలింగ్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తనిఖీలను నిర్వహించడం జరిగిందని పట్టుబడ్డ వారిని కోర్టులో హాజరు పరిచేముందు ట్రాఫిక్ ఎస్.ఐ రామచంద్రము  మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే అనర్థాలను వివరించారు. తదుపరి కుటుంబ పరిస్థితులను పట్టుబడిన వారికి వివరించారు. అనంతరం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరుచగా కోర్టు వారికి 31 వేల జరిమానా విధించడం జరిగిందని ట్రాఫిక్ ఎస్.ఐ. తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking