విద్యార్థులను మంచి క్రీడా కారులుగా తీర్చిదిద్దండి

జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి

జగిత్యాల ప్రతినిధి, ఆగస్టు 3(ప్రజా బలం) విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు అవసరమేనని విద్యార్థులను మంచి క్రీడా కారులుగా తీర్చిద్దిదే బాధ్యత పిఈటీలు, పీడి లపై ఉంటుందని జగిత్యాల జిల్లా వైద్యాధికారి జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం మినిస్టేడియంలోని క్రీడా భవనంలో జరిగిన జిల్లా స్థాయి క్రీడా సమాఖ్య సమావేశానికి జిల్లా వైద్యాధికారి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రంగాల్లో నైపుణ్యం కలిగివుండాలన్నారు. విద్యతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తే భవిష్యత్తుల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయన్నారు. విద్యార్థుల్లోని నైపుణ్యత దేశ, రాష్ట్ర క్రీడల్లో ప్రదర్శించే ప్రతిభ ఎంతో మేలుచేస్తుందన్నారు. ప్రతి వ్యాయమ ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యత పెరిగే దిశలో కృషి ఉండాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking