ఎలాంటి షరతులు లేకుండా ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలి
మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 22 : అడ్డగోలు ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు డిమాండ్ చేశారు.గురువారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిర్వహించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ…కాంగ్రెస్ రైతు రుణమాఫీ ఒక పెద్ద మోసమని,పూర్తి చేశామని చెప్పుకుంటున్న 2 లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదన్నారు.మేనిఫెస్టోలో మాట ఇచ్చి చేసిన అతి పెద్ద మోసం,దారుణమైన దగా అన్నారు.గత ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి,40 వేల కోట్లు,ఎస్ఎల్బీసీలో చెప్పింది 49 వేల 500 కోట్లు, కేబినెట్ లో చెప్పింది 31 వేల కోట్లు,బడ్జెట్ లో చెప్పింది 26 వేల కోట్లు, మొన్న ప్రకటించింది మాత్రం 17,900 కోట్లుగా రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.రైతులకు కేవలం 7500 కోట్లు, కానీ ముందు చెప్పిన రైతుల లెక్క 47 లక్షలు అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించినట్టుగా చేసిన రుణమాఫీ 17,934 కోట్లు, లబ్ది చేకూరాల్సి ఉండేది. బీఆర్ఎస్ మొదటిసారి చేసిన లక్ష రుణమాఫీలోనే 35 లక్షల మంది రైతులకు 17 వేల కోట్లమాఫీ జరిగిందన్నారు.ఏక కాలంలో మాఫీ చేయకుండా అడ్డమైన షరతులు,ఆంక్షలు పెట్టడం దారుణమన్నారు.అర్హులైన రైతుల్లో పావుశాతం మందికి కూడా మాఫీ కాలేదన్నారు.75 శాతం మందికి ఎగ్గొట్టి అరకొరగా చేసిన రుణమాఫీని గొప్పగా చెప్పు కోవడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు.డెడ్ లైన్లు,అడ్డగోలు మాటలతో రుణమాఫీ ఎగ్గొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా డిసెంబర్ 9 తేదీన.. ఏకకాలంలో 2 లక్షలమాఫీ చేస్తాం,రేపే బ్యాంకులకు ఉరికురికి లోన్ తెచ్చుకోండని చెప్పి ఇప్పుడు కేవలం17,934 కోట్లురూపాయలు.22 లక్షల 37వేల 848 మంది రైతులకు మాత్రమే చేసి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు.రుణమాఫీ మొత్తం అయ్యిందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓ వైపు ప్రగల్భాలు పలుకుతుంటే… మరోవైపు మంత్రులు మాత్రం రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాలేదంటున్నారని, ఇంకా కొనసాగుతుందని చెబుతున్నారన్నారు. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల 2 లక్షల రుణం మాఫీ అయ్యిందని అన్నారని,సాంకేతిక కారణాలతో పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని, ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రూ.12 వేల కోట్లు ఇంకా రైతుల ఖాతాలో వేయాల్సి ఉందని అంటాడన్నారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతుల ఖాతాల్లో 7500 కోట్లు రూపాయలు మాత్రమే జమ అయ్యిందన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి ఆంక్షలు లేకుండా అందరికీ 2 లక్షలు రూపాయల రుణమాఫీ అయ్యేదాక ఆగేది లేదని,కాంగ్రెస్ మెడలు వంచి రుణమాఫీ చేయిస్తామన్నారు
కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ చుంచు చిన్నయ్య,మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ పాదం శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య,శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్ మైనారిటీ నాయకులు షేక్ చాంద్,గంగాధర్, మోటపలుకుల శ్రీనివాస్ సర్పంచులు,ఎంపీటీసీలు, మండల నాయకులు పాల్గొన్నారు.