70 వేల రుణమాఫీ కాలేదని ఆవేదన
ప్రజాబలం – మెదక్ నియోజకవర్గం
మెదక్ జిల్లా నియోజకవర్గ కొల్చారం మండల కేంద్రంలో రైతులు చేస్తున్న రుణమాఫీ ధర్నాలో మహిళా రైతు హల్చల్ సృష్టించారు. ఒక మహిళా రైతు పురుగుల మందు డబ్బుతో ధర్నాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్నా తనకూ ప్రభుత్వం 70 వేల రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ఒకవేళ న్యాయంగా నాకు 70 వేల రుణమాఫీ చెయ్యకపోతే ఇక్కడే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని వెంటనే డబ్బు తీసుకొని పూల మందు తాగడానికి ప్రయత్నించింది.వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు మందు డబ్బాలు లాక్కొని ఆమెను అదుపులోకి తీసుకున్నారు