రైతులకు సకాలంలో రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారకొండ రాము

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..రైతులకు సకాలంలో రుణమాఫీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మారకొండ రాము అన్నారు
గురువారం నిర్మల్ జిల్లా స్థానిక ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ బూటకమన్నారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని అన్నారు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ రామకృష్ణారెడ్డి. డాక్టర్ సుభాష్ నజీరుద్దీన్. అకరం అలీ. పలువురు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking